Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బోరున విలపిస్తూ మమ్మూట్టి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నటి... ఎందుకు?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:05 IST)

Widgets Magazine
anna rajan

మలయాళ నటి అన్నా రాజన్ బోరున విలపించింది. అదీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ముందు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ, కానీ, మమ్మూట్టి ఫ్యాన్స్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారని పేర్కొంది. నిజానికి మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్మూట్టి. ఆయన్ను ఉద్దేశించి ఓ టీవీ షోలో అన్నా రాజన్ వ్యంగ్య కామెంట్స్ చేసింది. దీంతో స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయగా, కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని అందించింది. 
 
మమ్మూట్టి, ఆయన తనయుడు సల్మాన్‌ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్‌ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూట్టి తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా సమాధానమిచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమ్మూట్టి ఫ్యాన్స్‌.. ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. 
 
'మమ్మూట్టి సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూట్టి.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూట్టితో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి' అని వీడియోలో కోరింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది... క‌క్షతో రివ్యూలు రాస్తామా? : మహేశ్ కత్తి

సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అని ...

news

ప్రతి గొట్టంగాడి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ప్రతి గొట్టంగాడు చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన పని లేదన ...

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్ట్ లుక్... ఆర్జీవీ సర్‌ప్రైజ్

రియల్‌స్టోరీలను సిల్వర్‌స్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్ ఎవరంటే మొదటగా ...

news

వామ్మో... ఏంటి సమంతా ఇదీ? మరీ ఇంతా హాట్‌గానా?

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న ...

Widgets Magazine