శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (17:35 IST)

ఉక్రెయిన్ షూట్ మ‌ర్చిపోలేం- రాజ‌మౌళి - ఎన్‌.టి.ఆర్‌. ఏమ‌న్నాడో తెలుసా!

NTR-Rajamouli-Charan
రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. పాత్ర‌ల్లో ఎవ‌రు గొప్ప అనే తేడా అస్స‌లు క‌నిపించ‌దు. ఆయా పాత్ర‌ల్లోని ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుడిని మైమ‌రిపిస్తాయ‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఈనెల 25న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి, ఉక్రెయిన్‌లో షూటింగ్‌, వై..ఎస్‌. జ‌గ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భాన్ని గురించి ప‌లు విష‌యాల‌ను రాజ‌మౌళి, ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్ మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో వివ‌రించారు.
 
మీరు ఉక్రెయిన్ లో షూటింగ్ చేశారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే ఏమ‌నిపిస్తుంది?
అక్కడ షూటింగ్ చెయ్యడం చాలా ఫెంటాస్టిక్ గా జరిగింది. మేము అక్కడ షూట్ చేసిన టైం లో ఎప్పుడు అనుకోలేదు అక్కడ ఇలాంటి పొలిటికల్ టచ్ ఉంటుంది అనుకోలేదు. మేమంతా కూడా అక్కడి వారితో చాలా ఇంట్రాక్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయినా అక్కడి వారితో ఫోన్‌లో టచ్‌లో ఉంటూ తెలుసుకుంటున్నాం.
 
ఈ సినిమాకి టైటిల్ గా ముందు ఆర్‌.ఆర్‌.ఆర్‌. అనుకున్నారా వేరే ఏమన్నా అనుకున్నారా?
మొదటగా జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని అనౌన్స్ చేసాము. తర్వాత ఇది అందరికీ బాగా నచ్చేసింది. తర్వాత ఇంకా టైటిల్స్ ఏం పెడదాం అనుకున్నపుడు ఫ్యాన్స్ అంతా ఇంకేం టైటిల్ ఉంది మేము ఇదే ఫిక్స్ అయ్యాం అన్నాక మేము కూడా దాన్నే ఉంచేశాం.
 
ఈ సినిమాకి ఎన్టీఆర్, చరణ్ లను ఆ పాత్రల్లో ఎంచుకోవడానికి కారణం?
అల్లూరి సీతారామరాజు చాలా సౌమ్యంగా ఉంటాడు. మండే అగ్నిని సైతం తన గుండెల్లో పెట్టుకొని మనగలడు. అలాంటి లక్షణాలు చరణ్‌లో ఉన్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా చరణ్ స్థిరంగా ఉంటాడు. అందుకే అల్లూరి పాత్రకి చరణ్ ని అనుకున్నాను. అలాగే భీమ్ పాత్ర అనేది చాలా అమాయకంగా ఉంటుంది. ఏ భావోద్వేగాన్ని కూడా లోపల దాచుకోలేడు బయట పెట్టేస్తాడు అందుకే అలాంటి పాత్రకి తారక్ సూట్ అవుతాడు అని తనని ఎంచుకున్నాను.
 
ఇలాంటి ఇద్దరు స్టార్స్‌ని ఎలా బ్యాలన్స్ చేసారా అని ఫ్యాన్స్ చూస్తున్నారు?
మీరు సినిమా చూసినప్పుడు మాత్రం అలా ఎవరు ఫీల్ అవ్వరు. అలాగే నేను సినిమాలో ఎవరికీ ఈ పాట ఉండాలి, ఫైట్ ఉండాలి అని ఏది పెట్టుకోలేదు. కానీ అంతా ఏమిటంటే ఇదంతా ఆడియెన్స్ ఎలా తీసుకుంటారు అనేది. అందుకే ఆ ఎమోషన్స్ ని బ్యాలన్స్ చెయ్యడం కాస్త కష్టంగా అనిపించింది.
 
ఏపీలో ఇచ్చిన కొత్త జీవో కోసం మీ అభిప్రాయం చెప్పండి..
ఇప్పుడు అంతా బాగానే ఉంది మేము కూడా రెండు సార్లు సీఎం గారిని కలిసాం. కొత్త జీవో అయినా కొన్ని విషయాల్లో కాస్త క్లారిటీ కావాల్సి వచ్చింది. కానీ సీఎంగారు ఫైనల్‌గా మాకు ఫెవరబుల్‌గా ఉండే నిర్ణయాన్ని తీసుకొని 5 షోలకి కూడా అనుమతి ఇచ్చారు. ఇది గొప్ప విషయం.
 
ఈ సినిమాని తీస్తున్నప్పుడు మీకు ఏ అంశంలో ఎక్కువ భయం అనిపించింది?
ఇద్దరు హీరోస్ కూడా సినిమాకి సైన్ చేసారు అంతా బానే ఉంది కానీ మేము రాసుకున్న ఎమోషన్స్ ని అంతే రీతిలో రాబట్టగలనా అని డౌట్ మాత్రం ఉండేది. దాన్ని సరైన మార్గంలో తీసుకురావడం అనేది నాకు ఎక్కువగా భయం కలిగిస్తుంది. ఒక ఎమోషన్ ని సరైన మార్గంలో తీసుకురావడం అనేదే నాకు టఫ్ టాస్క్ లా అనుకుంటాను.
 
కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ టైం లో ఎలాంటి ప్రభావం తీసుకొచ్చింది?
ఆరోగ్యానికి సంబంధించి ఇష్యూస్ పక్కన పెడితే లాక్ డౌన్ లో మా సినిమాని ఇంకా ఎలా బెటర్ గా తీసుకురావాలో టైం వచ్చింది. ప్రతి సారి వచ్చిన గ్యాప్ లో అప్పటివరకు రష్ చూసుకొని సినిమాని ఇంకా ఎలా బెటర్ తీసుకురావాలో అనేది మేము ప్రయత్నం చేశాం.
 
రాజ‌మౌళిగారు కాబ‌ట్టే న‌టించాం- ఎన్‌.టి.ఆర్‌., చ‌ర‌ణ్‌
ఈ సంద‌ర్భంగా ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ, రాజ‌మౌళిగారి కోస‌మే ఇందులో  న‌టించాం. మ‌రో ద‌ర్శ‌కుడు అయితే న‌టించేవారం కాదు.  ఇందులో రామ్‌, భీమ్ పాత్ర‌ల జీవిత‌చ‌రిత్ర‌లోకి మేం పోలేదు. వారు ఎలావుంటార‌నేది కూడా చూడ‌లేదు. కేవ‌లం ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో ముందుకు సాగాం. క‌ష్ట‌ప‌డి మంచి ఔట్‌పుట్ వ‌చ్చేలా కృషి చేశాం. లాక్‌డౌన్ వ‌ల్ల కొద్దికాలం గేప్ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రితోపాటు కాస్త ఫీలింగ్‌లో వున్నాం. ఇప్పుడు అన్నీ స‌ద్దుమ‌ణిగాక సినిమా విడుద‌ల కావ‌డం ఆనందంగా వుంది అన్నారు. ముందుముందు భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ముఖ‌చిత్రం పారిపోతుంది. ఇప్పుడు ఇద్ద‌రు హీరోలతో సినిమా వ‌చ్చింది. భ‌విష్య‌త్‌లో మ‌రికొంత‌మందితో క‌లిసి రాజ‌మౌళిగారు సినిమా చేసినా ఆశ్చ‌ర్యంలేద‌ని అన్నారు.