Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహాదేవుడి లాంటి భర్త లభించాలంటే.. 16 సోమవారాలు వ్రతమాచరించాలి..

సోమవారం, 10 జులై 2017 (14:05 IST)

Widgets Magazine

మహాదేవుడు.. ముక్కంటి... పరమేశ్వరుడు.. ఈశ్వరుడు... అంటూ పలు నామాల్లో పిలువబడే ఆదిదేవుడు లాంటి భర్త లభించాలంటే.. 16 సోమవారాల పాటు వ్రతమాచరించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. గౌరీ శంకరుడు అయిన పరమేశ్వరుడే తన పత్నీకి తన శరీరంలో అర్థ భాగమిచ్చి అర్థనారీశ్వరుడు అంటూ పేరు సంపాదించాడు. అందుకే ముక్కంటి లాంటి భర్త లభించాలనుకునే కన్యలు.. సోమవారం పూట సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి.. పరమేశ్వరాధన చేయాలి.
 
మహాదేవుడు.. మహిళలకు ప్రాధాన్యమిచ్చే ఆదిదేవుడని.. ఎప్పుడూ ప్రశాంతంగా దర్శనమిస్తాడు. కానీ కోపావేశాలకు గురైతే మాత్రం విధ్వంసం తప్పదు. నిరాడంబరతకు ఆయన నిదర్శనం. భక్తుల కోరికలను తీర్చడంలో ముందుంటాడు. గౌరీ దేవి, గంగాదేవికి తన శరీరంలో సముచిత స్థానం ఇవ్వడం ద్వారా అలాంటి భర్తనే పొందాలనుకునే కన్యలు సోమవారం పగటి పూట ఉపవాసం ఉండాలి. సాయంత్రం శివుడిని శక్తి కొలదీ అభిషేకించి అర్చించాలి. సోమవారం రోజున పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే స్త్రీలకు ఐదవతనం చిరకాలం నిలిచి ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో పూజ చేసే వారికి విశేష ఫలితాలు దక్కుతాయి. 
 
శ్రావణ సోమవారం నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాధన చేస్తాడట. శివుడిని భక్తితో అభిషేకించిన వారికి శివుడితో పాటు శ్రీమహావిష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో కాకుండా ఏ మాసంలోనైనా 16 వారాల పాటు శివుడిని పూజిస్తే.. పరమశివుడి లాంటి భర్తే కాకుండా.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే సోమవారం పూట బిల్వదళాలు, పాలు, పువ్వులతో అర్చించే వారికి సకలసంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. చివరి 16వ వారం శివుడిని పాలతో అభిషేకించి.. అర్చన చేస్తే మంచి ఫలితాలుంటాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పిచ్చెక్కిస్తోన్న శివాని... అదొక్కటే నమ్ముకుంటే దెబ్బతింటావని చెప్పా... రాజశేఖర్

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ ...

news

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి.. నాకు మగపిల్లాడు పుడితే?: శ్రుతి హాసన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై.. సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద ...

news

లవ్ ప్రపోజ్ చేసిన అబ్బాయిని హర్ట్ చేసి ఫ్రెండ్‌షిప్‌ కట్ చేశా : నటి మాధవీలత

మాధవీలత. కర్ణాటక రాష్ట్రం నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయి. నచ్చావులే చిత్రంతో ...

news

శ్రీదేవికి సారీ చెప్పిన రాజమౌళి.. పబ్లిక్‌గా చెప్పడం తప్పే.. కానీ అబద్ధం చెప్పలేదు..

బాహుబలి సినిమాలో శివగామి పాత్రను అతిలోకసుందరి శ్రీదేవి నిరాకరించిందని.. దర్శక ధీరుడు ...

Widgets Magazine