శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:12 IST)

ఉపాసన కామినేని దయాగుణం... అంధ విద్యార్థులకు ఆపన్నహస్తం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం భారీగా పడుతుంది. వరద ప్రవాహం పోటెత్తడంతో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం భారీగా పడుతుంది. వరద ప్రవాహం పోటెత్తడంతో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు పొంగి ప్రవహించడంతో నాలాకు సమీపంలో ఉన్న బేగంపేట అల్లంతోటబావిలో ఉన్న దేవనార్‌ అంధుల పాఠశాల పూర్తిగా జలమయమైంది. 
 
వంటశాలతో పాటు ఆహార పదార్థాలను భద్రపరుచుకునే స్టోర్‌ రూమ్‌లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో నిత్యవసర వస్తువులు తడిసిముద్దయ్యాయి. ఈ విషయం బయటికి రావడంతో స్పందించిన సినీ హీరో రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఈ పాఠశాలలోని విద్యార్థులకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజన వసతి కల్పించేందుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారని పాఠశాల నిర్వాహకులు సాయిబాబా గౌడ్‌ వెల్లడించారు. 
 
ఈ పాఠశాలలో సుమారు 500 మంది అంధ బాలబాలికలు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వారు ప్రత్యేక వాహనంలో ఆహార పదార్ధాలు పంపడంతో వాటిని విద్యార్థులకు పంచి పెట్టారు. మరో రెండు రోజుల పాటు ఆహార పదార్థాలు పంపిస్తామని చెప్పారని తెలిపారు.