మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:18 IST)

''హై ఆన్ లైఫ్'' కార్యక్రమం, అతిథిగా పాల్గొంటున్న హీరో నవదీప్

డ్రగ్స్ మీద ఆధారపడటం మనలో చాలా మందికి జీవితంతో విడదీయరాని విషయం అయ్యింది. నొప్పులు, నిద్ర లేమి, జలుబు, ఫ్లూ, దగ్గు ఇలాంటి అనారోగ్యాలకు దీర్ఘకాలం డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్ లపై ఆధారపడటం శరీరానికి ఎంతో హాని చేస్తుంది. డ్రగ్ అడిక్షన్ నుంచి బయటపడినప్పుడే మనం ఈ ఆరోగ్య సమస్యలను సగం గెల్చినట్లు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ఈ విషయం మీద అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చింది.
 
ఉపాసన కొణిదెల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'యువర్ లైఫ్' వెబ్ పోర్టల్‌లో 'డ్రగ్స్ అండ్ అడిక్షన్' అంశాన్ని చర్చించబోతున్నారు. ఈ అంశంపై జరిపే చర్చలో ప్రముఖ నటుడు నవదీప్ అతిథిగా పాల్గొంటున్నారు. 'హై ఆన్ లైఫ్' పేరుతో ఈ డిస్కషన్ జరగనుంది.
 
మన జీవితంలో డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అనే అంశం మీద న్యూరాలజీ డాక్టర్ సి రాజేష్‌తో కలిసి నవదీప్ తమ సూచనలు, అనుభవాలు తెలపనున్నారు. వ్యసనం అనేది మన మనసుకు సంబంధించిన విషయం, దీన్ని అధిగమించేందుకు విలువైన సలహాలు 'హై ఆన్ లైఫ్' డిస్కషన్‌లో అందించనున్నారు.