గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:24 IST)

ఉమైర్ సంధూ పిచ్చివాగుడు.. పరువు నష్టం దావా వేశాం.. ఎవరు?

Urvashi Rautela
బాలీవుడ్‌కు చెందిన ఉమైర్ సంధూ నటి ఊర్వశీ రౌతేలాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయంలో ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఊర్వశీ ఫైర్ అయ్యింది. ఉమైర్ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేసింది. 
 
అఖిల్ తనను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని స్పష్టం చేసింది. తన ప్రతినిధులు ఇప్పటికే ఉమైర్ సంధూపై పరువు నష్టం దావా వేశారని వెల్లడించింది. ఇటువంటి పనికిమాలిన ట్వీట్స్ చేస్తున్న వారి వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఊర్వశి ఆవేదన వ్యక్తం చేసింది.