సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (10:39 IST)

'మహర్షి' దర్శకుడుతో పవన్ కళ్యాణ్ సినిమా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చారు. బాలీవుడ్ పింక్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. పవన్ కళ్యామ్ ఇమేజ్‌కు తగినట్టుగా ఈ చిత్ర కథలో మార్పులు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే పవన్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవ్వరు అనే దానిపైన మాత్రం ఇంతవరకు ఎలాంటి వార్తలు రాలేదు. 
 
అయితే తాజాగా పవన్ .. దిల్ రాజు సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఇతడే అంటూ ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా బాధ్యతలను దిల్ రాజు వంశీ పైడిపల్లి చేతిలో పెట్టనున్నారని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ‘మున్నా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి.. ఆ తర్వాత ‘బృందావనం’ ‘ఎవడు’ ‘మహర్షి’ వంటి సినిమాలను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కించాడు. 
 
ఇక మహర్షి సినిమా నేషనల్ అవార్డు మును సొంతం చేసుకున్నారు. అయితే మహర్షి సినిమా తర్వాత వంశీ ఎవరితోనూ సినిమాను కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీ పైడిపల్లికి ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు - వంశీ పైడిపల్లి ఇద్దరూ పవన్‌ని  కలిసారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.