శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:43 IST)

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా అర్థరాత్రి పూట జట్టుపట్టుకుని బయటకు గెంటేయించాడని సీనియర్ నటుడు విజయ్ కుమార్‌పై ఆమె కుమార్తె, సినీ నటి వనిత సంచలన ఆరోపణలు చేసింది.

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా అర్థరాత్రి పూట జట్టుపట్టుకుని బయటకు గెంటేయించాడని సీనియర్ నటుడు విజయ్ కుమార్‌పై ఆమె కుమార్తె, సినీ నటి వనిత సంచలన ఆరోపణలు చేసింది.
 
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన విజయకుమార్ తన కుమార్తెపై చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటిని ఆక్రమించుకుని ఖాళీ చేయడం లేదంటూ కుమార్తె వనితపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, ఇల్లు ఖాళీ చేయాలంటూ అడిగితే రౌడీలతో బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... అష్టలక్ష్మీ నగర్‌లోని ఇంటికి వెళ్లగా అధికారులపై వనిత అనుచరులతో కలిసి దాడిచేసి పరారైంది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్న వేళ వడపళనిలోని పోలీస్ స్టేషన్‌లో వనిత ప్రత్యక్షమైంది.
 
తన తండ్రి విజయకుమార్ కిరాయి మనుషులతో తనపై దాడి చేయించాడని పోలీసులకు వనిత ఫిర్యాదు చేసింది. బలవంతంగా అర్థరాత్రి తనను ఇంట్లో నుంచి జట్టుపట్టుకుని గెంటేశారని వాపోయింది. భర్త వదిలేసిన కన్నకూతురని కూడా చూడకుండా అర్థరాత్రి ఇంటి నుంచి గెంటేశాడని వెల్లడించింది. సినిమా ఆర్టిస్టు కావడంతో తనకు ఎవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.