గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (23:18 IST)

కార్తీక దీపంలో వంటలక్క ఇక వుండదా?

కార్తీక దీపం సీరియల్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా వంటలక్కకు పెద్ద ఫాలోయింగే వుంది. తాజాగా ఈ సీరియల్‌ కాస్త రూటు మారింది. వంటలక్కను డాక్టర్ బాబును కలిపి కథను కొత్త మలుపు తిప్పాడు డైరక్టర్. అయితే ఇపుడు మరో ట్విస్ట్ ఉండబోతుంది అట. 
 
ఇక త్వరలోనే కథను కొత్త కోణంలో మళ్లించనున్నారట. సీరియల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇపుడు ఉన్న కార్తీక్ , దీప పిల్లలను, అలాగే మోనిత కొడుకును త్వరలోనే పెద్దవాళ్ళు అయినట్లుగా యుక్త వయసుకు వచ్చిన వారిలాగా చూపించబోతున్నారట. 10 ఏళ్ల తరవాత అని బోర్డ్ చూపించి కథను సరికొత్తగా చూపించబోతున్నారు అని సమాచారం.
 
అయితే దీప, కార్తిక్‌లకు బదులుగా వేరే సీనియర్ నటులను ఉంచి, మోనిత కొడుకు పాత్రలో కార్తిక్ ఆ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీప మాత్రం ఈ సీరియల్‌లో ఇకపై కనిపించరు అని సమాచారం. మరి ఈ సీరియల్‌లో వంటలక్క లేకపోవడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.