శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:36 IST)

ప్రేమ పీక్ స్టేజ్‌లో ఉంది.. ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు : వరలక్ష్మి

తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తె, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. ప్రస్తుతాని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని ఆమె తేల్చి చెప్పింది.
 
నిజానికి తమిళ హీరో విశాల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనీ కొన్నాళ్లుగా వదంతులు వినిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది. తనకు నిశ్చితార్థం జరగలేదూ.. పెళ్లీ చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వదంతులు సృష్టించి, తనను కిందకు లాగాలని చూస్తున్న వారందరికి తన ధన్యవాదాలంటూ సెటైర్లు వేసింది.