శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (21:21 IST)

నికోలాయ్ సచ్ దేవ్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం

Varalakshmi
Varalakshmi
ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ నిశ్చితార్థం ఘనంగా జరుగనుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్ దేవ్‌తో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబైలో శుక్రవారం నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు.
 
వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి... నికోలాయ్‌తో గత పద్నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా, కళలను ప్రోత్సహించే వ్యక్తిగానూ గుర్తింపు పొందారు.
 
నిశ్చితార్థ వేడుకలో, వరలక్ష్మి బంగారు పట్టు చీరలో మెరిసిపోయింది. నికోలాయ్ ఐవరీ, గోల్డ్ షేడ్స్‌లో సరిపోయే పనాచే కట్టును ఎంచుకున్నాడు.