మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (23:10 IST)

స్టేజిపై అందరి ముందే వర్షకు తాళి కట్టేశాడు..

Varsha emmanuel
Varsha emmanuel
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలలో వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చాలా స్కిట్స్‌లలో తమ మధ్య ప్రేమ ఉన్నట్లు నటించారు. అలాగే స్కిట్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్‌పై వర్షకు ఎంతో ప్రేమ ఉన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పింది. ఒక స్కిట్‌లో వాళ్లిద్దరకి పెళ్లి కూడా చేసి చూపించారు. 
 
ప్రస్తుతం క్స్‌ట్రా జబర్దస్త్ షోకి న్యాయనిర్ణేతగా నటుడు పోసాని కృష్ణమురళి వచ్చారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ చూపించారు. ప్రోమో వరకు మాత్రమే డైలాగ్‌లు చెబుతుంది. తర్వాత కంటికి కూడా కనిపించదు సార్ అని వర్షపై ఇమ్మాన్యుయేల్ సెటైర్ వేశాడు.
 
ఇదంతా చూసిన పోసాని కృష్ణమురళి.. ఇమ్మాన్యుయేల్ ఒక క్లారిఫికేషన్ కావాలి. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా.. అని అడిగారు. అది ఆ అమ్మాయే చెప్పాలని ఇమ్మాన్యుయేల్ రిప్లై ఇచ్చాడు. దీనికి అతని స్ట్రేట్ ఫార్వాడ్‌కి లవ్యూ అంటూ చెప్పాడు పోసాని.
 
తర్వాత గెటప్ శీను తాళి తీసుకురావడంతో స్టేజిపై అందరి ముందే వర్షకు ఇమ్మాన్యుయేల్ తాళి కట్టాడు. అప్పుడు పోసాని బాబు.. బాబు.. అంటూ అరిచాడు. యాంకర్ రష్మి షాక్‌లో ఉండిపోయి చూసింది. 
 
ఇదంతా తాజాగా విడుదల చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో చూపించారు. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే నవంబర్ 11న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.