గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (16:37 IST)

వరుణ్ ధావన్ ప్రియురాలిని చంపేస్తానంటూ హల్‌చల్

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు ఓ మహిళా అభిమాని నుంచి విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని అతని ఇంటి ముందు హల్‌చల్ చేసింది. వరుణ్‌ను అతన్ని కలవడానికి చాలా రోజులుగా వేచి చూస్తున్న సదరు అభిమాని.. ఎంతకీ వరుణ్ కనిపించకపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగింది. 
 
వరుణ్ ఇంట్లో లేడని, కళంక్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడని చెప్పినా ఆమె వినలేదు. నేను నటాషా (వరుణ్ గర్ల్‌ఫ్రెండ్)ను చంపేస్తా అంటూ తెగ హడావిడి చేసింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను పిలవాల్సి వచ్చింది. ఈ ఘటనపై వరుణ్ సెక్యూరిటీ సిబ్బంది వివరణ ఇచ్చారు. 
 
సాధారణంగా అభిమానులు ఎవరు వచ్చినా.. వరుణ్ కాదనకుండా సెల్ఫీలు దిగుతారు. కానీ కొన్నాళ్లుగా బిజీగా ఉండటంతో ఆ మహిళా అభిమానిని కలవలేదు. ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్పినా ఆమె వినలేదు. గొడవ పెట్టుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని ముందు భయపెట్టింది. అయినా సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో నటాషాను చంపుతా అంటూ బెదిరించింది అని వాళ్లు పోలీసులకు వివరించారు. ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.