గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (16:43 IST)

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ నాన్-థియేట్రికల్ రైట్స్ 50+ కోట్లు

Varun Tej
Varun Tej
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'పరేషన్ వాలెంటైన్' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా  నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని  భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే చిత్రంగా రూపొందుతోంది.
 
జాతీయ నేపథ్యం, గ్రాండ్ స్కేల్ మేకింగ్ తో ఈ చిత్రం భారీ బజ్‌ను సంపాదించింది. ఇదీలావుండగా సినిమా యొక్క నాన్-థియేట్రికల్ హక్కులు, శాటిలైట్, డిజిటల్/స్ట్రీమింగ్, ఆడియో అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 కోట్ల+కి సోల్డ్ అయ్యాయి. వరుణ్ తేజ్‌కి ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ప్రైస్. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ భారీ డీల్స్ వస్తున్నాయి.
 
ఈ విజువల్ గ్రాండియర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తుండగా, రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించిన మానుషి చిల్లర్ తెలుగు అరంగేట్రం చేస్తున్నారు.
 
2022 విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మన దేశంలోని హీరోలను సెలబ్రేట్ చేసుకునే దేశభక్తి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు.
 
‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,  రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు.  నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్  వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో విడుదల కానుంది.