శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 జులై 2017 (15:16 IST)

పూరీకి మెగా హీరో వరుణ్ తేజ్ మద్దతు.. ఆయన అలాంటి వ్యక్తి కాదు..

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. బుధవారం సిట్ ముందు హాజరైన పూరీ.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో తన ఆవేదనను పంచుకున్నారు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు పూరీకి

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. బుధవారం సిట్ ముందు హాజరైన పూరీ.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో తన ఆవేదనను పంచుకున్నారు. దీంతో చాలామంది సినీ ప్రముఖులు పూరీకి మద్ధతు ప్రకటిస్తున్నారు. 
 
తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ పూరీకి మద్దతు పలికాడు. పూరీ జగన్నాథ్ చాలామంచి వ్యక్తి అని ఆయన తన ఆరోగ్యం గురించే కాకుండా ఇతరుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటారని.. అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడని వార్తలు రావడంతో తనను షాక్‌కు గురిచేశాయని.. ఆయనతో పనిచేసిన సమయంలో ఆయన డ్రగ్స్ తీసుకోవడం తానెప్పుడూ చూడలేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. 
 
మరోవైపు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్ దందాపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. డ్రగ్స్‌ కేసును సంచలనాత్మకం చేయడం సరికాదని, దర్యాప్తులో వివరాలు తెలిసేవరకు కాస్త సంయమనం పాటించాలని ట్విట్టర్లో తెలిపారు.