శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (10:04 IST)

వాఘా సరిహద్దుకు బయలుదేరిన వరుణ్ తేజ్. ఎందుకంటే..

VarunTej at airport
VarunTej at airport
వరుణ్ తేజ్ తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తుంది సోనీపిక్చర్స్ సంస్థ. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు. విమానంలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించారు. తాజాగా సంక్రాంతి పండుగ జరుపుకుని నేడు వరుణ్ తేజ్ దేశం బోర్డ్ వాఘా సరిహద్దుకు తన టీమ్ తో బయలు దేరి వెళ్ళారు.
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేశభక్తి ప్రేరేపిత గీతం వందేమాతరం గ్రాండ్ లాంచ్ కోసం ఆయన వాఘా సరిహద్దుకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5.02 గంటలకు విడుదల చేయనున్నారు. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో కంచె చేశారు. ఇది వరుణ్ కు సరికొత్త కథాంశం.  శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా ఛాలెంజ్ గా వుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా తాజాగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోని పిశ్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో విడుదలకానుంది.