1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 3 జులై 2016 (12:06 IST)

రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడిన వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి.. సినిమా చూడొద్దు..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వీరప్పన్ భార్య విరుచుకుపడింది. వీరప్పన్ జీవితంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హిందీలో వీరప్పన్ పేరుతో తీసిన సినిమా విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వీరప్పన్ భార్య విరుచుకుపడింది. వీరప్పన్ జీవితంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ హిందీలో వీరప్పన్ పేరుతో తీసిన సినిమా విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో కూడా కిల్లర్ వీరప్పన్ పేరుతో ఆ సినిమా వచ్చింది. అలాగే తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాను చూడొద్దని ముత్తులక్ష్మి ప్రజలను కోరింది.
 
తన భర్త జీవితంపై రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించి తీశారని ముత్తులక్ష్మి విమర్శలు గుప్పించింది. వీరప్పన్‌పై ఇష్టం వచ్చినట్టు కథ అల్లాడని, సినిమాలో చూపించిందంతా అసత్యమని విమర్శించింది. వీరప్పన్ జీవితాన్ని తప్పుగా తీశాడని విమర్శించింది. తను చెప్పినదానికి, సినిమాలో చూపించిన దానికి చాలా తేడా ఉందని, పైగా వేరే భాషలో కూడా తీస్తానని చెప్పలేదని, చెప్పకుండా తీసి రిలీజ్ చేశాడని ఆమె ఆవేశంతో చెప్పింది.