శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (16:05 IST)

"నారప్ప" ట్రైలర్ అదుర్స్.. యూట్యూబ్‌లో నెంబర్ వన్ (Video)

విక్టరీ వెంకటేష్ "నారప్ప" సినిమా ట్రైలర్‌ను బుధవారం ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ట్రైలర్ విడుదల అయిన కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. 
 
తమిళ చిత్రం అసురన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన నారప్ప చిత్రానికి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల "నారప్ప" చిత్రానికి దర్శకత్వం వహించారు. 
 
షూటింగ్ పూర్తి అయి చాలా రోజులు అయిన కరోనా కారణంగా విడుదలకి నోచుకోని ఈ చిత్రాన్ని అటు సినిమా థియేటర్స్ లో విడుదల చేయాలని మొదట ఆలోచనలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.
 
ఇక తాజాగా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ లో వెంకటేష్ తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కుటుంబ కథతో పాటు మంచి డ్రామా అండ్ యాక్షన్ తో తెరకెక్కిన "నారప్ప" చిత్రం ఐఎండిబిలో మంచి రేటింగ్ సాధించింది. 
 
అయితే జూలై 20న విడుదల కానున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి నటించగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ట్రైలర్ లో వెంకటేష్ నటన చూసిన అభిమానులు "నారప్ప" చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేకపోతున్నందుకు కాస్త నిరాశ చెందిన అతి త్వరలో ఓటీటీ లో రాబోతున్న "నారప్ప" కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.