శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 27 మే 2016 (12:32 IST)

వెంకటేష్ - నయనతారల 'బాబు బంగారం' ఫస్ట్‌లుక్ 2న రిలీజ్

విక్టరీ వెంకటేష్, నయనతారలు జంటగా నటిస్తున్న తాజా చిత్రం "బాబు బంగారం''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ కామెడి పోలీల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో ఓ సదా సీదా బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించనుందట. 
 
ప్రస్తుతం పాటల షూట్ చేసుకునే పనిలో ఈ చిత్ర బృందం స్పెయిన్‌కు వెళ్లింది. అక్కడ అందమైన లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరించనున్నారు. గతంలో వెంకటేష్, నయనతారలు "లక్ష్మి'', ''తులసి'' చిత్రాల్లో జంటగా నటించారు. కాగా ''తులసి'' చిత్రంలోని పలు పాటలను స్పెయిన్లోనే చిత్రీకరించిన విషయం తెలిసిందే. 
 
మే నెల చివరిలోగా షూటింగ్ మొత్తం పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని వచ్చే నెల జూన్ 2న  విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఎప్పటిలాగే మారుతీ తన కామెడితో ఇరగదీయనున్నాడట. 
 
తమిళ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కృష్ణ దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.