గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 27 అక్టోబరు 2018 (15:45 IST)

వెంకీ మామ గురించి వ‌స్తోన్న వార్త‌ల్లో వాస్త‌వం లేదు..!

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో ఓ సినిమా రానుంద‌ని.. ఈ చిత్రానికి టైటిల్ వెంకీ మామ అని తెలిసిన‌ప్ప‌టి నుంచి అటు వెంకీ అభిమానులు ఇటు నాగ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెరపై చూస్తామా అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌కి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు.
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది కానీ... ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాక‌పోవ‌డంతో వెంకీ మామ ఆగిపోయింది అనే ప్ర‌చారం మొద‌లైంది. అస‌లు విష‌యం ఏంటంటే... వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. నాగ‌చైత‌న్య ఓ వైపు స‌వ్య‌సాచి ప్ర‌మోష‌న్స్, మ‌రోవైపు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న వెంకీ మామా ఇంకా స్టార్ట్ కాలేదు. అంతే కానీ.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టు ఈ సినిమా ఆగిపోలేదు. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం... న‌వంబ‌ర్ సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. నాగ చైత‌న్య న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడ‌ని తెలిసింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమా అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల‌కు ఓ పండ‌గ అని చెప్ప‌చ్చు.