గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:47 IST)

ఆగిన షూటింగ్... వెంకీమామకు ఏమైంది.? ఇంత‌కీ ఏం జ‌రిగింది...?

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం వెంక‌టేష్... నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టిస్తోన్న చిత్రం 'వెంకీమామ‌'. డి.సురేశ్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. బాబీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వెంక‌టేశ్‌, పాయల్ రాజ్‌పుత్‌ల‌పై రామోజీఫిలిం సిటీలో ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. 
 
ఆ సంద‌ర్భంలో వెంక‌టేశ్ కాలు స్వ‌ల్పంగా బెణికింది. దీంతో యూనిట్ షూటింగ్‌ను నిలిపివేశారు. వెంకీ గాయాన్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్లు కొన్నిరోజుల విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ట‌. 
 
దీంతో వెంకీ మామ సినిమా ప‌రిస్థితి ఏంటి అనే టెన్ష‌న్ మొద‌లైంది. అయితే... చిత్ర యూనిట్ చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం... ఈ సినిమాని అనుకున్న తేదీకే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. 
 
వెంకీ రెండు, మూడు రోజుల్లో షూటింగ్‌లో జాయిన్ అవుతాడ‌ట‌. ఈ నెలాఖ‌రుకు షూటింగ్ కంప్లీట్ అవుతుంది. వ‌చ్చే నెల‌లో మిగిలిన రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించ‌డంతో షూటింగ్ పూర్త‌వుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ద‌స‌రాకి "వెంకీమామ" రావ‌డం ఖాయం అంటున్నారు. మ‌రి... త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటిస్తారేమో చూద్ధాం.