గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (17:31 IST)

పుష్ప డైలాగ్.. వేణు మాధవ్ డైలాగును కాపీ కొట్టేశారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో "ఈ కాలు నాదే.. ఆ కాలు నాదే.. నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పేముంది.. నీ ఓనర్ పైన వేసిననా ఏందీ కాలు" అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. 
 
ఈ డైలాగ్‌ను తన అన్న దగ్గర నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నానని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ డైలాగ్‌ని గతంలో ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు వేణుమాధవ్ చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుకుమార్ ఈ డైలాగ్‌ను ఇక్కడి నుంచి కాపీ కొట్టి ఉండవచ్చునని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.