బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:23 IST)

సమంతనే కాదు.. శోభితతో కూడా చైతూ విడిపోతారు.. తండ్రి అయ్యే యోగం లేదు..

nagachaitanya
అగ్ర హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభితతో నిన్ననే నిశ్చితార్దం చేసుకున్నారు. శుభమా అంటూ రెండో పెళ్లి చేసుకుందామనుకుంటే.. జ్యోతిష్యులు వేణు స్వామి అడ్డం వచ్చారు. ఈ నేపథ్యంలో చైతూ-శోభిత జీవితం ఎలా ఉండబోతుందో అని ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి వారి జాతకం చెప్పారు. జాతకం రీత్యా తండ్రి స్థానం బాగాలేదని చెప్పారు.
 
వివాహాం తర్వాత తండ్రి అయ్యే యోగం లేదని చెప్పుకొచ్చాడు. ఐవీఆర్, టెస్ట్ ట్యూబ్ బేబి ద్వారా కంటే చెప్పలేము అన్నారు. సమంతతో గతంలోనే విడిపోతారని చెప్పాను. అలాగే జరిగింది. అప్పట్లో సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పగానే.. తనను అందరు బండ బూతులు తిట్టిన విషయాన్ని వేణు స్వామి ప్రస్తావించారు. 
 
మరోవైపు శోభిత కూడా అమావాస్య రోజు పుట్టింది. ఇపుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం చూసి విడిపోతారని ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత తనను బండ బూతులు తిట్టేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జ్యోతిష్యాన్ని ఎవరు కొట్టిపారేయద్దని చెప్పుకొచ్చారు.
 
నిశ్చితార్థ ముహూర్తం పండితులు పెట్టినట్టు లేదు. నాగార్జున త్రిపుల్ 8 వచ్చేలా ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. 8వ నెల 8వ తారీఖు 2024 కలిపితే 8. సంఖ్యాశాస్త్రం ప్రకారం నిర్ణయించుకున్నారు. ఈ ముహూర్తం నిషేధం. నిశ్చితార్థానికి ఇది అసలు పనికి రాదని వేణు స్వామి అన్నారు.