గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 మే 2020 (12:48 IST)

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు గుండెపోటుతో కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 36 సంవత్సరాలు. బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అభినయ్ నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
 
వాణీశ్రీకి ఇద్దరు సంతానంలో కుమారుడు అభినయ్‌తో పాటు అనుపమ అనే కుమార్తె కూడా వుంది. అభినయ్ భార్య కూడా వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె వున్నారు. ఇదిలావుంటే అభినయ్ మృతిని పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.