‌క్రాక్‌లో రవితేజ యాక్టింగ్ అదుర్స్ : వెంకటేష్ ప్రశంసలు

krack
ఠాగూర్| Last Updated: గురువారం, 14 జనవరి 2021 (11:34 IST)
మాస్ మహారాజ్ రవితేజ - దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ముచ్చటగా వచ్చిన మూడో చిత్రం "క్రాక్". ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రిలీజైంది. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అతని నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ఈ సినిమాతో గోపీచంద్, రవితేజా కాంబో హ్యాట్రిక్ చేసింది. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాను మొదటగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాకే రవితేజ చెంతకు చేరిందట. అయితే ఆ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో కాదు. టాలీవుడ్‌లో విజయాన్నే ఇంటిపేరు చేసుకున్న విక్టరీ వెంకటేష్. మొదటగా ఈ సినిమా కథను తీసుకొని గోపీ వెంకీని కలిసాడట.

కథ మొత్తం విన్న వెంకీకి కథపైన అంత నమ్మకం కలుగలేదంట. దాంతో కథలో కొన్ని మార్పులు చేయాలని ఆ మార్పులను చెప్పాడట. కానీ గోపీ ఆ మార్పులు చేయడానికి సుముఖం చూపలేదట. దాంతో వెంకీ ఈ సినిమాకి నో చెప్పాడు. దాని తర్వాత అదే కథను రవితేజ వద్దకు తీసుకెళ్తే రవితేజ వెంటనే ఓకే చెప్పాడట. అప్పటికే గోపీతో రెండు సినిమాలు చేసిన రవితేజ మరోసారి గోపీని నమ్మేందుకు ఆలోచించలేదు. అంతే వీరి కాంబో 2021ని భారీ బ్లాక్ బస్టర్‌తో ప్రారంభించింది.దీనిపై మరింత చదవండి :