వెంకీమామ విడుదల తేదీపై క్లారిటీ?

venky mama
Last Updated: బుధవారం, 18 సెప్టెంబరు 2019 (16:04 IST)
విక్టరీ వెంకటేష్, అక్కినేని అబ్బాయి కలిసి నటిస్తున్న చిత్రం "వెంకీమామ". బాబీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే, ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగిలిన షూటింగ్ అంతా పూర్తిచేసుకుంది. ఇందులో నిజ జీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేష్ - నాగ చైతన్యలు వెండితెరపై కూడా అదే పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్.. మాస్.. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు.

అయితే, ఈ చిత్రాన్ని విజయదశమికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ, ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, అక్టోబరు రెండో తేదీన మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" చిత్రం విడుదలవుతోంది. దీంతో డిసెంబరు మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.దీనిపై మరింత చదవండి :