సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (19:20 IST)

నయన్ ఫోటో వైరల్.. విఘ్నేష్ ఎమోషనల్ పోస్టు.. అసలేం జరుగుతోంది? (video)

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్‌లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌, నయనతార వివాహం జరుగనుంది. తాజాగా నానుమ్ రౌడీదాన్ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా నయనతారను ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు.
 
''నిన్ను కలిసిన తర్వాతే నా జీవితం ఎంతో మధురంగా మారింది.. నానుమ్ రౌడీదాన్ సినిమాతో నాకు విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించి.. నేనో మంచి జీవితాన్ని పొందే అవకాశాన్ని నాకు అందించావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశాడు. ఇకపోతే.. నయనతార కూడా ఓ ఫోటోను నెట్టింట పోస్టు చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాణంలోని ‘నెట్రికన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. నయన్ ఈ సినిమాలో కంటిచూపు సమస్య ఉన్న యువతి పాత్రలో నటిస్తోంది. ‘నెట్రికన్’‌ను మిలింద్‌రావ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌ సరసన 'దర్బార్‌'తో పాటు, విజయ్‌తో 'బిగిల్' చేస్తోంది.
 
తెలుగులో నయన్ చిరంజీవికి జంటగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా నటించింది. ఈ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తాజాగా నయన్, తన ప్రియుడు విఘ్నేష్ శివన్ జంటగా దిగిన ఓ ఫోటోలో విఘ్నేష్‌ను చేయిని ప్రేమగా పట్టుకుని నయన్ అలా స్టైలీష్‌గా చూస్తూ.. జీన్స్ టాప్‌లో అదిరిపోయింది. ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.