మట్టిలో కలిసిపోయే అవయవాలను దానం చేద్దాం... విజయ్ దేవరకొెండ
ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న పేస్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త మరణానంతరం అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు.
అదేసమయంలో తాను జీవించినంతకాలం తన శరీర అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటానని, చనిపోయిన తర్వాత వాటిని దానం చేస్తానని చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో అవయవదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.
అదేసమయంలో అవయవాలు ఎంతో విలువైనవని, వాటిని మట్టిపాలు చేయండ కంటే మరొకరికి దానం చేయడం ద్వారా వారికి ఆయుష్షు పోసినవాళ్లం అవుతామని చెప్పారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.