గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (18:12 IST)

'ప‌చ్చీస్' టీజ‌ర్ న‌చ్చింద‌న్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda, rams,etc
ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ప‌చ్చీస్'‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌.
 
'ప‌చ్చీస్' టైటిల్ టీజ‌ర్‌ను గురువారం సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ త‌న‌కు బాగా న‌చ్చింద‌నీ, సినిమా చాలా ఇంట‌రెస్టింగ్‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంద‌నీ ఆయ‌న అన్నారు.
 
ద‌ర్శ‌కులు శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి మాట్లాడుతూ, "క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ప‌చ్చీస్‌ను రూపొందిస్తున్నాం. కొత్త‌ద‌నం కోసం ఎదురుచూసే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. విజువ‌ల్స్‌, మ్యూజిక్‌, సౌండ్ లాంటి అన్ని విష‌యాల్లోనూ ఈ సినిమా బాగా వ‌స్తోంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. నాన్‌స్టాప్ యాక్ష‌న్‌తో, గాంబ్లింగ్‌, పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుంది. ముఖ్య‌మైన విష‌యం ఏమంటే థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్ కోస‌మే ఈ సినిమా తీస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా మ్యూజిక్‌, సౌండ్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి అని చెప్పారు.‌
 
హీరో రామ్స్ మాట్లాడుతూ, "ఎంతో క్వాలిటీతో 'ప‌చ్చీస్' వ‌స్తున్న తీరుకు నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఈ విష‌యంలో నా టీమ్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా. నా ఫ‌స్ట్ ఫిల్మ్‌కు గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తోన్న వారికి థాంక్స్. టీజ‌ర్ రిలీజ్ చేసినందుకు, త‌న స‌పోర్ట్ అందిస్తున్నందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు స్పెష‌ల్ థాంక్స్." అన్నారు.
 
హీరోయిన్ శ్వేతావ‌ర్మ మాట్లాడుతూ, "ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప‌చ్చీస్‌కు ప‌నిచేయ‌డాన్ని ఎంత‌గానో ఆస్వాదించాను. ఆడియెన్స్ ఈ మూవీని ఎంజాయ్ చేస్తార‌నీ, ప‌చ్చీస్ స‌క్సెస్ అవుతుంద‌నీ గ‌ట్టిగా న‌మ్ముతున్నా." అన్నారు.
 
షూటింగ్ పూర్త‌యిన 'ప‌చ్చీస్'‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుదిద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.