దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్‌కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకుంటున్నాడు విజయ్. దానికి ఉదాహరణ లాక్‌డౌన్ సమయంలో అతను చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.
నిత్యావసర సరుకులు కొనడానికి ఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు. ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ఞతా భావంగా నోటితో పెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.