బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (18:09 IST)

స‌మంత‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

Samantha, Vijay Devarakonda
Samantha, Vijay Devarakonda
స‌మంత ప్ర‌భు త‌న పుట్టిన‌రోజు అయిన ఏప్రిల్ 28న షూటింగ్‌లో పాల్గొంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టిస్తున్న  VD11 షూటింగ్ కాశ్మీర్‌లో జ‌రుగుతోంది. అర్ధరాత్రి 12 గంటలు కావ‌డంతో సినిమా ప్రధాన బృందం, ముఖ్యంగా విజయ్ దేవరకొండ, నటి కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని ప్లాన్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పేక‌ప్ అవుతుంద‌న‌గా ఆన్-స్క్రీన్ పేరుకు బదులుగా ఆమె ఆఫ్-స్క్రీన్ పేరును ప‌ల‌క‌డంతో సమంత దాదాపు కన్నీళ్లు పెట్టుకుంది. అంతా నిశ్భ‌బ్దంగా వాతావ‌ర‌ణ వుంది. స‌రిగ్గా ఆ సమయంలో విజయ్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, సమంతకి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియ‌జేశాడు. 

 
ఈ వీడియోను విజ‌య్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సామ్ థ్రిల్‌ ఫీల్ అయ్యి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వెలకట్టలేనిది అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఇందుకు హీరోయిన్ సమంత స్పందిస్తూ స్వీటెస్ట్ సర్ప్రైజ్ అంటూ బ‌దులిచ్చింది. వీరిద్ద‌రూ మ‌హాన‌టిలో క‌లిసి న‌టించారు. ఆ త‌ర్వాత పూర్తిస్థాయి పాత్ర‌ల‌లో నటిస్తున్న చిత్రం ఇదే.
 
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అలీని తీసుకున్నారు. మాలీవుడ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న‌ ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.