సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 జులై 2023 (20:03 IST)

విజయ్ దేవరకొండ, సమంత ఖుషి టైటిల్ సాంగ్ రాబోతుంది

Vijay devakonda- kushi song
Vijay devakonda- kushi song
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించారు. 
 
ఖుషి చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటికీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రాం రీల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఖుషి నుంచి మూడో పాట రానుంది. ఖుషి అంటూ సాగే ఈ పాటను జూలై 28న రిలీజ్ చేయతోన్నారు.
 
ఈ టైటిల్ సాంగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగినట్టు.. అలా గాల్లో తేలిపోతోన్న విజయ్ దేవరకొండ పోస్టర్ ఎంతో కూల్‌గా ఉంది. ఇక ఖుషి టైటిల్ సాంగ్ కోసం శ్రోతలు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూలై 28న ఖుషి టైటిల్ సాంగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయనుంది.
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.