మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2025 (15:40 IST)

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

King dom first day collection poster
King dom first day collection poster
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ "కింగ్డమ్" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్ 39 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక వీక్ డే లో ఇంత భారీ వసూళ్లు సాధించడం "కింగ్డమ్" సక్సెస్ రేంజ్ ను ప్రూవ్ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 
 
ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ "కింగ్డమ్" ఒక హ్యూజ్ నెంబర్ తో రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద "కింగ్డమ్"  సినిమా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ దాటి దూసుకెళ్తోంది. ఇటీవల సరైన విజయాలు లేని టాలీవుడ్ కు ఈ సినిమాతో ఒక సాలిడ్ హిట్ దక్కినట్లయింది.