మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (17:59 IST)

#boycottliger సంగతేంటి?.. లైగర్ రన్ టైమ్ ఎంతో తెలుసా?

liger
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్స్ చివరి దశకు వచ్చాయి. కొద్ది రోజుల దూరంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో అనన్య పాండే, రమ్య కృష్ణన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ వెల్లడైంది. శ‌నివారం ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ వ‌చ్చింద‌ని, రన్ టైమ్ 140.20 నిమిషాలు అంటే 2 గంట‌ల 20 నిమిషాల 20 సెక‌న్ల‌గా ఉన్నట్లు తెలిసింది. 
 
విజయ్ దేవరకొండ అంతర్జాతీయ ఖ్యాతిని పొందే అండర్ డాగ్ బాక్సర్ పాత్రలో లైగర్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో కూడా కనిపించనున్నారు. 
 
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 
ఇదిలా ఉంటే.. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాపై నెటిజన్లు బాయ్‌కాట్‌ లైగర్ అంటూ ట్విట్టర్లో ఒక హాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు.
 
''ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్‌ కాదు మేము. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే. లాక్‌డౌన్‌ సమయంలో నేను మొదలు పెట్టిన 'మిడిల్‌క్లాస్‌ ఫండ్‌' కోసం ఎంతో మంది విరాళం ఇచ్చారు. అలాంటి వాళ్లు మనకు కావాలి. ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు 'లైగర్‌' కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్‌ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్‌ చేస్తారా. ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదు'' అంటూ విజయ్‌ అన్నారు.