శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (11:08 IST)

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రికి గాయాలు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబసభ్యులు ఆయనని హుటా హుటీన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే...కుమారకం రిసార్ట్‌కు వెళ్ళిన ఎస్ ఏ చంద్రశేఖర్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబసభ్యులు ఆయనని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... కుమారకం రిసార్ట్‌కు వెళ్ళిన ఎస్ ఏ చంద్రశేఖర్ హఠాత్తుగా కింద పడిపోవడంతో తలకు, వెన్నెముక, మెడడుకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే చంద్రశేఖర్‌ని ఐసియులో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన కొత్త సినిమా పనులు ప్రారంభించిన నేపథ్యంలో చంద్రశేఖర్ కుమారకంలోని రిసార్ట్‌కు వెళ్ళగా ఈ ఘనటన చోటుచేసుకుందని కుటుంబసభ్యులు చెప్పారు. కాగా చంద్రశేఖర్ వయసు 71 సంవత్సరాలు. ఈయన తమిళంలో పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.