శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 23 జులై 2015 (13:44 IST)

సినిమాల వైపు రాములమ్మ చూపు... రీఎంట్రీకి రెడీ..

గతంలో వెండితెరపై వెలిగిన అందాల భామలు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ అయ్యి సినిమాల్లో దూసుకుపోతుంటారు. ఆ కోవలో తాజాగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి చేరారు. గత కొంత కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మళ్లీ నటించనున్నట్టు సమాచారం. అందుకోసం ఆమె కథలను కూడా వింటున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయం గురించి స్వయంగా విజయశాంతి తెలుపుతూ.. తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండడం, అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడం వంటి కారణాల వలన తాను  కొంతకాలంగా సినిమా రంగానికి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. అయితే తానిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఓ సినిమా తీయాలని నిర్ణయించానన్నారు. తన పాత్రకు తగిన విధంగా కథను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. తాను తీయబోయే సినిమా దేశ భక్తితో కూడుకున్నదిగా ఉంటుందని విజయశాంతి స్పష్టంచేశారు.