రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
మరాఠీ, హిందీ, రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 77 యేళ్లు. గత కొద్ది రోజులుగా పూణేలో దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో వైద్యులు ఈయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆయన శరీర అవయవాలు పనిచేయలేకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
విక్రమ్ గోఖలే విషయానికొస్తే.. ఈయన కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే ఉన్నారు. ఈయన నాన్న చంద్రకాంత్ గోఖలే.. తొలి తరం రంగస్థల నటుడిగా రాణించారు. 1971లో 26వ ఏట అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన పర్వానా సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు.