శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (13:24 IST)

'వినయ విధేయ రామ' పోస్టర్.. కైరా అద్వానీకి సహాయం చేస్తూ..

'వినయ విధేయ రామ' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే  ఊరమాస్ లుక్‌తో డైలాగ్ చెప్పిన చరణ్ మాస్ అభిమానులను ఫిదా చేశారు. 
 
మాస్ సినిమాగా అభిమానులు ఫిక్స్ అయిన సందర్భంలో న్యూ ఇయర్ విషెస్ చెబుతూ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. 
 
గుడిలో గంట కొట్టించేందుకు రామ్ చరణ్.. కైరా అద్వానీకి సహాయం చేసే పోస్టర్ ఆసక్తికరంగా వుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌ ఎలా వుందో ఓ సారి చూడండి.