శనివారం, 18 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (15:01 IST)

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

Amrutha Iyer, Allari Naresh
Amrutha Iyer, Allari Naresh
అల్లరి నరేశ్ సినిమాలంటే కుటుంబమంతా హాయిగా చూడగలిగే సినిమాలుగా వుంటాయని తెలుసు. అల్లరి సినిమాతో ఇంటిపేరుగా మార్చకున్న నరేశ్ ఆ పేరు మార్చుకోవాలని వైవిధ్యమైన సినిమాలు చేశాడు. నాంది, సీమశాస్త్రి, ఉగ్రం, గమ్యం, ఇట్లు మారేడిమల్లి ప్రజానీకం వంటి భిన్నమైన సినిమాలు చేసినా ఆయన అల్లరి పేరు మారలేదు. అందుకే ఇకపై దానిగురించి ఆలోచించనని అంటున్నారు. తాజాగా ఆయన చేసిన చిత్రం బచ్చల మల్లి. ఈనెల 20వతేదీ విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
 
- బచ్చల మల్లి కథను దర్శకుడు సుబ్బు చెప్పినప్పుడు బచ్చల అంటే ఏదో ఆకుకూరేమో అనుకున్నా. కానీ ఆతర్వాత ఆయన చెప్పింది ఏమంటే.. బచ్చల అనేది ఇంటి పేరు మల్లి అనేది వ్యక్తిపేరు. కోస్తాంధ్రలో 1990లో మల్లి అనే వ్యక్తి కథగా ఆయన చెప్పారు. చాలా మొండిగా వుండే వ్యక్తి. ఎవ్వరినీ లెక్కచేయడు. ఎవడు నాన్న, ఎవడికి నాన్న అంటూ చాలా రఫ్ గా మాట్లాడేవాడు. సీరియస్ గా గడ్డెంతో రౌడీ బిహేవియర్ వుండే వాడి జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడంతో ఏమి జరిగింది అనేది సినిమా.
 
- వైలెంట్ వుండే మల్లి సైలెంట్ గా వుండే అమ్రుత అయ్యర్ మధ్య జరిగే ప్రేమకథ. ఆమె ప్రేమించిన తర్వాత అంతకుముందు ఆయన జీవితంలో వుండే వైలెంట్ పనులు పెండ్లి చేసుకున్నాక వెంటాడే సంఘటనలతో సినిమా రూపొందింది. దర్శకుడు బాగాడీల్ చేశాడు.
 
- అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని తీస్తారు. ప్లాప్ వచ్చాక మల్లీ ఆ తరహా సినిమాలు చేయకూడదు అనుకుంటాం. కానీ ఏదో లెక్కలు మిస్ అయి మళ్లీ మరో సినిమా చేస్తాం. అదీ ప్లాప్ అవుతుంది. ఇలా జడ్జి చేయడం చాలా కష్టం. అందుకే ఏ సినిమా చేసినా దాని ఫలితం ఆశించకుండా నిజాయితీ సినిమాలు చేసుకుంటూ పోవాలని తెలుసుకున్నా.
 
-  సుడిగాడు సినిమా ఇక్కడ బాగా ఆడింది. దానిని బాలీవుడ్ లో డబ్బింగ్ చేశాం. ఆ సినిమా అర్థంకాక సౌత్ లో ఇలాంటి పిచ్చి సినిమా తీస్తారా? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేశారు. ఆ సినిమా ఇక్కడి సినిమాల స్కూప్ తో చేసిందని చెప్పినా అర్థం కాలేదు. అందుకే అక్కడి హీరోల సినిమాలపై స్కూప్ చేయాలని సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది అన్నారు.