సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (09:39 IST)

లిప్ లాక్ ముద్దుల్లో మునిగితేలిన హీరో - దర్శకుడు!!

సినీ ప్రముఖులు వెండితెరపై అందాలు ఆరబోయడం సహజం. కానీ, కొందరు సెలెబ్రిటీలు నిజజీవితంలోనూ హద్దులు దాటిపోతుంటారు. తాజాగా ఓ దర్శకుడు, ఓ హీరో లిప్ లాక్ ముద్దుల్లో మునిగిపోయారు. వారిద్దరూ ఎవరో కాదు.. తెలుగు దర్శకుడు, తెలుగు హీరో. వారి పేర్లు... సిద్ధు జొన్నలగడ్డ హీరో కాగా, దర్శకుడు రవికాంత్ పెరెపు. వీరిద్దరి లిప్ లాక్ ముద్దు సీను ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ చిత్రానికి రవికాంత్ పెరెపు దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినిలు హీరోయిన్లుగా నటించగా, ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 
 
గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన ఈ సినిమాకి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఫొటోలో దర్శకుడు రవికాంత్ పెరెపు, హీరో సిద్ధు జొన్నలగడ్డ లిప్ లాక్ పెట్టుకుంటున్నారు. ప్ర‌చారం కోసం ఇలా ట్రై చేసి ఉంటారని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. కాగా, రవికాంత్ పెరెపు 'క్షణం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన రెండో సినిమా 'కృష్ణ అండ్ హిజ్ లీల' ఓటీటీలో సంద‌డి చేస్తుంది.