పందెంకోడి-2కు భారీ హక్కులు.. టెంపర్ రీమేక్‌లో ఆయనే?

తమిళ హీరో విశాల్ తాజా సినిమా ''పందెంకోడి-2''. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాలే నిర్మాత. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున

vishal
Selvi| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (15:49 IST)
తమిళ హీరో విశాల్ తాజా సినిమా ''పందెంకోడి-2''. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాలే నిర్మాత. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా తెలుగు వెర్షన్ హక్కులను ఠాగూర్ మధు తీసుకున్నారు. శాటిలైట్ హక్కులు .. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని దాదాపు 10 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మరోవైపు.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ''టెంపర్'' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి రానుంది. కంటెంట్ పరంగా ఈ సినిమా ఇతర భాషా దర్శక నిర్మాతలను హీరోలను ఆకట్టుకుంది. 
 
ఈ కారణంగానే ఈ సినిమా తమిళంలోను రీమేక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు... విశాల్ హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నారు.దీనిపై మరింత చదవండి :