విశాల్‌పై శివాలెత్తిన రోజా భర్త ఆర్కే సెల్వమణి.. కార్మికుల కడుపు కొడతున్నాడంటూ?

బుధవారం, 2 ఆగస్టు 2017 (12:41 IST)

vishal

కోలీవుడ్ నిర్మాతల సంఘానికి, కార్మికుల సంఘాని మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినిమా కార్మికులు (ఫిల్మ్ ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) ఆందోళనకు దిగింది. దీంతో తమిళనాడులో షూటింగ్‌లు ఆగిపోయాయి. వీరి డిమాండ్లను నిర్మాతల సంఘం తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కార్మికుల సంఘంలో లేనివారితో షూటింగ్‌లు చేసుకోవాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ సలహా ఇచ్చాడు. దీనిపై వైకాపా ఎమ్మెల్యే రోజా భర్త, కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. విశాల్ సలహా కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన కార్మికుల సంఘం ఆందోళనతో దాదాపు 25 వేల మంది సిబ్బంది షూటింగ్‌లకు దూరమైయ్యారు దీంతో 20 సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇందులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా కూడా వుండటం గమనార్హం. 
 
సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, స్టంట్ డైరక్షన్‌కు చెందిన కార్మికులు షూటింగ్‌ల్లో పాల్గొన్నప్పటికీ.. కార్మికుల సంఘాలు సమ్మె బాట పట్టడంతో షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని.. విశాల్ నిర్ణయాలు కార్మికులకు అనుకూలంగా లేవని ఆర్కే సెల్వమణి మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు నిర్మాతల సంఘం సిద్ధం కావాలన్నారు.దీనిపై మరింత చదవండి :  
Vishal Fefsi Rk Selvamani Producers Council Film Employees Federation Of South India

Loading comments ...

తెలుగు సినిమా

news

నన్నలా చూస్తే పూరీ తట్టుకోలేడు... ప్రపంచమంతా శృంగారం చుట్టూనే... నటి హేమ

టాలీవుడ్ నటీనటుల్లో ఉన్నదివున్నట్లుగా ముఖం మీదే మాట్లాడేవారు ఎవరయా అంటే, పోసాని ...

news

కన్నడ నటుడు ఆత్మహత్య... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా...!

కన్నడ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనయ పేరు ధృవ్ శర్మ. స్టార్ సెలబ్రిటీ క్రికెట్ ...

news

కేన్సర్ బాధపడుతున్న అల్లరి సుభాషిణి... ఆదుకున్న బిగ్‌బాస్ పార్టిసిపెంట్

అనేక తెలుగు చిత్రాల్లో నటించిన సుభాషిణి ఇపుడు కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తెలుగు చిత్ర ...

news

నా హీరో చాలా గ్రేట్ అంటోన్న సమంత: యుద్ధం శరణం టీజర్‌ను 11 లక్షల మందికిపైగా చూశారు.. (వీడియో)

అక్కినేని నాగార్జున కోడలు కథానాయిక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి ...