శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 ఆగస్టు 2021 (16:21 IST)

మాడిపోయిన గుత్తి వంకాయలా వుంది నీది: సుడిగాలి సుధీర్ పైన విష్ణుప్రియ కామెంట్

ఆమధ్య కరోనాతో ఆగిపోయిన ప్రోగ్రాం పోరాపోవే మళ్లీ వస్తోంది. సుడిగాలి సుధీర్, విష్ణుప్రియ మధ్య సాగే పంచ్‌లు ఓ రేంజిలో వుంటాయన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎపిసోడ్‌కి సంబంధించి ఓ ప్రోమోని వదిలారు. అందులో సుడిగాలి సుధీర్ పైన విష్ణుప్రియ చేసిన కామెంట్లు రచ్చరచ్చగా వున్నాయి.
 
అందులో సుడిగాలి సుధీర్ వేసిన పంచ్ డైలాగ్.. టిప్పర్ లారీకి బస్సుకి మధ్యలో పడిపోయి గుద్దుకుపోతే ఎలా వుంటుందో అలా అయిపోయింది నీ ముఖం అని విష్ణుప్రియపై పంచ్ వేయగా, మా అమ్మ గుత్తి వంకాయ కూర వండుతూ వుంటే అందులో ఓ వంకాయ మాడిపోయినప్పుడు ఎలా వుంటుందో నీది అలా వుందంటూ షాకింగ్ కామెంట్ కొట్టింది. మొత్తమ్మీద పోరాపోవే షోతో మరోసారి ఇద్దరూ రచ్చ చేయబోతున్నట్లున్నారు.