బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:17 IST)

54 అడుగుల హనుమాన్ విగ్రహం సెట్‌లో విశ్వంభర స్టంట్ సీక్వెన్స్‌

54 feet Hanuman statue
54 feet Hanuman statue
మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక.
 
ప్రస్తుతం టీమ్, టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌లో మ్యాసీవ్ స్టంట్ సీక్వెన్స్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంగ్-ఆన్ కానుంది. ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో చిత్రీకరించబడింది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులు, మాసెస్ ను  థియేటర్‌లలో మెస్మరైజ్ చేయనుంది.  
 
విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.
 
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
 నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్