శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 11 ఆగస్టు 2018 (19:00 IST)

విశ్వరూపం-2 సినిమా గురించి నిజాలు తెలిస్తే ప్రేక్షకులు షాకే...

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించి, సంచలన విజయం సాధించిన విశ్వరూపం-1కు సీక్వెల్‌గా శుక్రవారం విడుదలైన విశ్వరూపం-2 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విశ్వరూపం-1 చూసి, ఆ అంచనాలతో థియేటర్‌లోకి వెళ్లిన వారికి ఈ చిత్రం నిరాశనే మిగిల్చ

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించి, సంచలన విజయం సాధించిన విశ్వరూపం-1కు సీక్వెల్‌గా శుక్రవారం విడుదలైన విశ్వరూపం-2 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విశ్వరూపం-1 చూసి, ఆ అంచనాలతో థియేటర్‌లోకి వెళ్లిన వారికి ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. అలాగని అంత పేలవంగా లేదు.
 
మొదటి భాగంలో కమల్‌ హాసన్‌ పాకిస్థాన్‌, ఆప్ఘనీస్థాన్‌లోకి ప్రవేశించి, అక్కడ ఆల్‌ఖైదా నెట్‌వర్క్‌లో భాగంగా మారిపోయింది, అమెరికా సైన్యంతో కలిసి తీవ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను ప్రేక్షకులను థియేటర్‌లో సీటు కొనపై కూర్చోబెడతాయి. పోరాట దృశ్యాలు అంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు ఆ భాగంలో. కథ కూడా అంతే ఉత్కంఠగా సాగుతుంది. మొదటి భాగం అంతటి ఆసక్తికరంగా రెండో భాగాన్ని మలచలేకపోయారు కమల్‌.
 
మొదటి భాగంలో ఆర్మీ సోల్జర్‌గా కనిపించే కమల్‌…. రెండో భాగంలో ‘రా’ ఆఫీసర్‌గా కనిపిస్తారు. రా అనేది ఉగ్రవాదం వ్యవహారాలను డీల్‌ చేసే భారత దేశ అత్యంత శక్తివంతమైన విచారణా సంస్థ. లండన్‌లోని సముద్రంలో ఎప్పుడో మునిగిపోయిన అణ్వాయుదాలను పేల్చడం ద్వారా సునామీ సృష్టించి, లండన్‌ను మునిగిపోయేలా చేసి, భారీ విధ్వంసానికి ఆల్‌ఖైదా కుట్ర చేస్తుంది. దాన్ని పసిగట్టిన విసామ్‌ (కమల్‌ హాసన్‌) తన భార్య నిరుపమ (పూజా కుమార్‌), తన తోటి అధికారి ఆస్మితా సుబ్రమణ్యం(ఆండ్రియా)తో కలిసి ఆ కుట్రను భగ్నం చేయడానికి లండన్‌ వెళతారు. 
 
అక్కడ ఈ విధ్వంసాన్ని ఎలా ఆపారు అనేది ఇంటర్వెల్‌ దాకా సాగుతుంది. పాకిస్తాన్‌లో అల్‌ఖైదా నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసినపుడు… ఉమర్‌ అనే ఉగ్రవాది కుటుంబంతో కలిసి వున్న కమల్‌ నిజరూపాన్ని అతను తెలుసుకుంటాడు. అయినా అతని చేతుల్లో నుంచి అప్పుడు తప్పించుకుంటాడు. ఆ తరువాత ఏడేళ్లకు విసామ్‌ రా ఆఫీసర్‌ అయిన తరువాత అతన్ని చంపడానికి ఉమర్‌ ప్రయత్నిస్తుంటారు. దీన్ని ఎదుర్కోవడం ఇంటర్వెల్‌ తరువాత కథ.
 
విశ్వరూపం -1 చూడని వారికి రెండోభాగం ఏమాత్రం అర్థంకాదు. ఎందుకంటే ఈ రెండో భాగం మొత్తం మొదటి భాగానికి కొనసాగింపే. అందుకే మధ్యమధ్యలో మొదటి భాగంలోని సన్నివేశాలు కనిపిస్తుంటాయి. విశ్వరూపం-1 చిత్రం 2013లో విడుదలయింది. అంటే దాదాపు ఐదు సంవత్సరాల తరువాత రెండో భాగం వచ్చింది. మొదటి భాగం చూసిన ప్రేక్షకులు కూడా కథ మరిచిపోయివుండొచ్చు. అందుకే రెండో భాగం చూసే ముందు మొదటి భాగం మరోసారి చూడటం ఉత్తమం. అలా చూడని వారు… రెండో భాగం చూసి వచ్చిన తరువాతనైనా మొదటి భాగాన్ని మరోసారి చూస్తారనడంలో సందేహం లేదు.
 
స్క్రీన్‌ప్లే కూడా చాలా సంక్లిష్టంగా కనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకునికి అంతగా అర్థంకాదు. కాస్త ఆదమరచినా ఏ సన్నివేశం ఎక్కడ జరుగుతుంతో కూడా అంతుచిక్కదు. ఇక కమల్‌ యాక్షన్‌ సన్నివేశాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవలీలగా పండించారు. ఈ భాగంలో కమల్‌ తల్లి పాత్ర కూడా ఉంది. సెంటిమెంటు కోసం ఈ పాత్ర కాస్త దోహదపడిందిగానీ…. ప్రేక్షకులు ఆశించేంతగా అది పండలేదు. ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్లకూ కమల్‌తో సమానమైన పాత్ర వుంది. భార్య నిరుపమ డాక్టర్‌. మరో హీరోయిన్‌ రా అధికారి. ఈ ముగ్గురితోనే కథ మొత్తం నడుస్తుంది.
 
మతం పేరుతో మారణ హోమం సృష్టించడాన్ని, రాజకీయాలు చేయడాన్ని ఎండగట్టడమేగాక… ఒక మతం వారంతా ఉగ్రవాదులైతే… ఒక మతం వారంతా దేశభక్తులే అనే భావన సరైనది కాదని ఈ చిత్రం ద్వారా సందేశం ఇచ్చారు కమల్‌. మొదటి భాగంతో పోల్చితే అంత  బాగాలేకున్నా… విశ్వరూపం-2 కూడా ఒకసారి చూడాల్సిన సినిమానే.