శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (18:41 IST)

'వాల్తేరు వీరయ్య' నుంచి మరో మాస్ బీట్ సాంగ్ రిలీజ్

Waltair Veerayya
మెగాస్టార్ చిరంజీవి - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ బ్యానరుపై నిర్మించగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ నెల 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదలకానుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్టే. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ బుధవారం మరో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ నెల 11వ తేదీన ఉదయం 10.35 నిమిషాలకు హైదరాబాద్ నగరంలోని మల్లారెడ్డి యూనివర్శిటీలో ఈ మాస్ బీట్ పాటను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. మాస్ మహారాజ్ రవితేజ, ప్రకాష్ రాజ్, బాబి సింహా వంటివారు కీలక పాత్రలను పోషించారు. ఇందులో హీరోయిన్ హనీరోజ్ ఓ కీలక పాత్రను పోషించారు. అలాగే, ఊర్వశి రౌతల్లా ఒక ఐటమ్ సాంగ్‌లో నటించారు.