శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (10:39 IST)

ఏకంగా 500 టిక్కెట్లను బుక్‌ చేసిన వరంగల్ కలెక్టర్

'బాహుబలి 2' చిత్రాన్ని తిలకించేందుకు ఒక్క టిక్కెట్ దొరకడం గగనమైపోయిన ఈ రోజుల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ ఏకంగా 500 టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఈ చిత్రం 28వ తేదీన విడుదల కానున్న విషయంతెల్సిందే. దీంతో

'బాహుబలి 2' చిత్రాన్ని తిలకించేందుకు ఒక్క టిక్కెట్ దొరకడం గగనమైపోయిన ఈ రోజుల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ ఏకంగా 500 టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఈ చిత్రం 28వ తేదీన విడుదల కానున్న విషయంతెల్సిందే. దీంతో సినీజనాలతోపాటు అధికారులు సైతం పెద్దఎత్తున టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు. 
 
ఈపరిస్థితుల్లో వరంగల్ కలెక్టర్ అమ్రపాలి కట అయితే ఏకంగా 500 టికెట్లు బుక్ చేసుకుని, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వరంగల్ అర్బన్ కలెక్టర్ అయిన ఈమె.. ఫ్యామిలీతోపాటు అఫీషియల్స్‌ కోసం ఒక షో మొత్తం బుక్ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయారు. 
 
మరోవైపు... ఈ గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద 'బాహుబలి' రెండో భాగానికి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, తెల్లవారుజాము నుంచి వేచి చూసిన అభిమానులు నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇక్కడ బిగ్ స్క్రీన్‌పై రూ.250, నార్మల్ స్క్రీన్స్‌పై రూ.150 టికెట్ రేటుగా ఉండగా, నార్మల్ స్క్రీన్‌పై రూ.250కి టికెట్లను సిబ్బంది విక్రయిస్తుండటంతో, పలువురు అభిమానులు గొడవకు దిగారు. రూ.150 సినిమా టికెట్‌ను కాంబో పేరుతో మరో వంద రూపాయలు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.