గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2020 (15:58 IST)

'జబర్దస్త్' తర్వాత నాగబాబు షో.. #BommaAdhirindi యాంకర్‌గా శ్రీముఖి..

#BommaAdhirindi
'జబర్దస్త్' నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగబాబు అదిరింది షో చేస్తున్నారు. ఈ రెండు షోల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఐతే లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్న 'అదిరింది షో' సడెన్‌గా ఆగిపోయింది. గత ఆదివారం కూడా ఎపిసోడ్ ప్రసారం కాలేదు. 'బెస్ట్ ఆఫ్ అదిరింది' పేరుతో పాత స్కిట్లు ప్రసారం చేశారు. ఆ ఎపిసోడ్‌తో 'అదిరింది' అభిమానులు షాక్ అయ్యారు. ఏంటి ఇవాళ ఎపిసోడ్ ప్రసారం కాలేదని చర్చించుకున్నారు.
 
'అదిరింది'కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వస్తున్న సమయంలో తీసేశారేంటి.. అని గుసగుసలాడుకున్నారు. ఈ క్రమంలోనే జీతెలుగు మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'అదిరింది' స్థానంతో.. 'బొమ్మ అదిరింది' అంటూ కొత్త ప్రోమోను వదిలారు. ఇది ఈ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం కానుంది. 
 
జడ్జిగా నాగబాబు, టీమ్ లీడర్లుగా పాత వారే ఉన్నారు. కానీ మరో జడ్జి నవదీప్, యాంకర్లు రవి, భాను కనిపించలేదు. రవి, భానును తీసేసి వారి స్థానంలో శ్రీముఖిని తీసుకున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఆ ప్రోమోలో నాగబాబు, శ్రీముఖి, చంద్ర, డాన్సర్ పండు, ధన్‌రాజు, వేణు, సద్దాం కనిపించారు. వీరితో పాటు అలీ, యాంకర్ సుమ, డాన్స్ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ సందడి చేశారు.