శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (18:04 IST)

ప్రియాంకా చోప్రా ప్రియుడు జంటిల్‌మన్.. ఎలాగంటే? (Video)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌కు మకాం మార్చేసింది. క్వాంటికో సిరీస్ ద్వారా పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. అక్కడే అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో బిజీ బిజీ అయిపోయింది. అంతేగాకుండా మర

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌కు మకాం మార్చేసింది. క్వాంటికో సిరీస్ ద్వారా పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. అక్కడే అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో బిజీ బిజీ అయిపోయింది.


అంతేగాకుండా మరో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంక చోప్రా ప్రేమాయణం కొనసాగిస్తుంది. ఇటీవల ముంబై వచ్చి తిరిగి అమెరికా వెళ్లిన ఈ జంట ఎక్కడికెళ్లినా కలిసి తిరుగుతున్నారట. 
 
ఈ క్రమంలో ప్రియాంక చోప్రాతో కలిసి వెళ్తున్న నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రాతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన అభిమానిని గౌరవించాడు. ప్రియాంకను గుర్తించిన ఓ యవతి, ఆమెతో సెల్ఫీ కోరగా, నిక్ జోనాస్ ఓ జంటిల్‌మన్‌లా పక్కకెళ్లి నిలబడ్డాడు.

ఆ యువతిని ఆప్యాయంగా పలకరించిన ప్రియాంక, ఆమెతో సెల్ఫీ దిగేంత వరకూ నిక్ వేచి చూశాడు. ఈ తతంగాన్ని మరో అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.