గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (11:14 IST)

మేం దానికోసమే సినిమాలు చేస్తున్నాం: నందమూరి బాలకృష్ణ

Balakrishna
Balakrishna
నటుడు అంటే ఏడవం, అరవడం, నవ్వించడం కాదు. పరాయ ప్రవేశం. ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశించాలి. ఆ పాత్రలో జీవిస్తాం. అదే గొప్ప. భారతదేశంలో గొప్ప నటుడు జగపతిబాబు అని బాలకృష్ణ అన్నారు. జగపతిబాబు నటించిన రుద్రాంగి సినిమా ప్రీరిలీజ్‌ వేడుక గచ్చిబౌలిలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడారు. 
 
ఇప్పుడు సినిమా మాస్‌ ఆడియన్స్‌ కోసం కాదు. అవన్నీ ఎప్పుడో దాటిపోయాం. సినీ పరిశ్రమ నిలబడాలి. పదిమందికి పని కల్పించాలి. దానికోసమే మేము సినిమాలు చేస్తున్నాం. అప్పుడో ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిలుతుంది. మంచి పాత్రలు రచించిన దర్శకుడు, తీస్తున్న నిర్మాతల వారివల్లే ఇండస్ట్రీ బట్టకడుతుంది. అలాంటివారిలో రసమయి బాలకృష్ణ ఒకరు. ఆయన తీసిన ఈసినిమా బాగా ఆడాలి. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృశాఖలో మంచి పదవి ఇచ్చింది. ఈ సందర్భంగా కె.సి.ఆర్‌.కు థ్యాంక్స్‌ చెబుతున్నాను అని అన్నారు.